నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండల కేంద్రంలో అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న కావాలి యాదగిరి పై కేసు నమోదు చేసినట్లు సివిల్ సప్లై డిప్యూటీ తహసిల్దార్ పవన్ తెలిపారు. గ్రామంలోని భరతమాత విగ్రహం కాలనీలో అక్రమ సిలిండర్లు నిల్వ ఉంచి, చిన్న గ్యాస్ బుడ్డిలు నింపుతున్నారన్న ఫిర్యాదు మేరకు తనిఖీలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. తనిఖీల్లో కావాలి యాదగిరి ఇంట్లో అక్రమంగా 5 సిలిండర్లు ఉన్నాయని గుర్తుంచి, అట్టి సిలిండర్లను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ తహసిల్దార్ పవన్ తెలిపారు. గ్యాస్ సిలిండర్లను స్థానిక గ్యాస్ గోదాంకు అప్పగించినట్లు పేర్కొన్నారు.తదుపరి నివేదికను జిల్లా అడిషనల్ కలెక్టర్ ( సివిల్ సప్లయ్) కు నివేదిక అందజేస్తామన్నారు. గృహ సంబందించిన సిలెండర్లును వ్యాపార నిమిత్తం ఉపయోగించరాదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి శరత్ కుమార్, గ్రామ పాలన అధికారులు కే.అశోక్, పి.అజయ్, దేవరాజు, తదితరులుు పాల్గొన్నారు.



