Monday, July 20, 2026
E-PAPER
HomeNewsఆగస్టు నుంచి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ.!

ఆగస్టు నుంచి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ.!

- Advertisement -

నవతెలంగాణ మల్హర్‌‌రావు

ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మరోసారి ప్రజా పంపిణీ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 3 నెలల రేషన్‌ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. వచ్చే నెల ఆగస్టు,సెప్టెంబర్,అక్టోబరు నెలలకు సంబంధించిన రేషన్‌ బియ్యాన్ని ఒకేసారి అందిం చనున్నారు. ఈ మేరకు కేంద్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయటంతో ఆగస్టు 1 నుంచి మూడు నెలల బియ్యం పంపిణీకి పౌర సరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణంగా ప్రతి నెల మొదటి 15 రోజులు మాత్రమే డీలర్లు రేషన్ బియ్యం ఇచ్చేవారు.వచ్చే నెలలో 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వ నుండటంతో ఆగస్టు లో 31 రోజులు దుకాణాలు తెరచి బియ్యం అందించాల్సి ఉంది. ప్రతి రేషన్ కార్డుదారు మూడు సార్లు వేలి ముద్రలు వేయాల్సి ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -