Thursday, May 28, 2026
E-PAPER
Homeవరంగల్తాడిచర్ల డేంజర్ జోన్ ఇండ్లకు 261 కోట్లు నష్టపరిహారం విడుదల

తాడిచర్ల డేంజర్ జోన్ ఇండ్లకు 261 కోట్లు నష్టపరిహారం విడుదల

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్‌రావు: మండల కేంద్రమైన తాడిచర్లలో టిజీజెన్కో ఆధ్వర్యంలో కాపురం ఓసిపి బ్లాక్-1 డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లకు రూ.261 కోట్ల నష్టపరిహారం జమ చేసినట్లు జెన్కో అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓపెన్ కాస్ట్ మైన్ విస్తరణ, రక్షణ చర్యల్లో భాగంగా ప్రమాదకర ప్రాంతంలో (డేంజర్ జోన్)లో ఉన్న ఇండ్లు, ఇంటి స్థల సేకరణ ప్రక్రియలో భాగంగా బాధితులకు నష్టపరిహారం కింద 80 శాతం నిధులు రూ.261 కోట్ల రూపాయలను భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయ ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు,ఈ సందర్భంగా భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ను జెన్కో అధికారులు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -