నవతెలంగాణ-పెద్దవూర: బాల్య వివాహాలు చేయడం చట్టరిత్యా నేరం అని, ప్రోత్సాహంచిన వారిపై కూడా చట్ట పరంగా చర్యలు తప్పువని చలకుర్తి సర్పంచ్ సల్ల అంజిరెడ్డి గ్రామస్థులకు సూచించారు. గురువారం గ్రామ పంచాయతీ లో బాల్య వివాహాలు చేయడం వల్ల జరిగే నష్టం పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈసందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ.. బాల్యవివాహాలు పిల్లల భవిష్యత్తును వారి ప్రాథమిక హక్కులను పూర్తిగా నాశనం చేస్తాయని,చిన్న వయసులో పెళ్లి చేయడం వలన అమ్మాయిల చదువు దూరమై తీవ్రమైన ఆరోగ్య సమస్యలు బారిన పడతారని వివరించారు.ఇది శారీరిక మానసిక ఎదుగుదలకు దెబ్బతీసి వారి పేదరికంలోనే ఉంచేస్తుందని,బాల్య వివాహాలను అడ్డుకో వడం మన అందరి సామాజిక బాధ్యత అని తెలిపారు. 18 సంవత్సరాల లోపు బాలికలకు వివాహం చేయడం చట్ట విరుద్ధం అని గుర్తుచేశారు. అనంతరం మైనర్ బాలికలకు, బారులకి వివాహాలు జరిపించమని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చేపూరి లక్ష్మమ్మ,అంగన్వాడీ టీచర్లు యాదమ్మ,మంగమ్మ,గ్రామస్తులు,మహిళలు యువకులు పాల్గొన్నారు.
బాల్య వివాహాలు చట్టరిత్యా నేరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



