Tuesday, February 3, 2026
E-PAPER
Homeఆదిలాబాద్భార్యను రోడ్డుపై చితకబాదిన కానిస్టేబుల్ సస్పెండ్

భార్యను రోడ్డుపై చితకబాదిన కానిస్టేబుల్ సస్పెండ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలో మద్యం మత్తులో భార్యపై దాడి చేసిన కానిస్టేబుల్ రవిప్రసాద్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. మద్యం సేవించి అర్ధనగ్నంగా భార్యను రోడ్డుపైకి తీసుకెళ్లి చితకబాదిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన పోలీస్ శాఖ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉందని ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాఖాపరమైన చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -