Thursday, May 28, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంకెనడాలో భారతీయ విద్యార్థిని దారుణ హత్య..

కెనడాలో భారతీయ విద్యార్థిని దారుణ హత్య..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కెనడాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న మరో భారతీయ విద్యార్థిని దారుణ హత్యకు గురయ్యారు. గుజరాత్‌కు చెందిన 22 ఏండ్ల యువతిపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేసి ప్రాణాలు తీశాడు. ఈ విషాద ఘటన కెనడాలోని నయాగరా ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలిని గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా బోర్సాద్ పట్టణానికి చెందిన విధి కల్పేష్‌భాయ్ మేఘానిగా గుర్తించారు. ఆమె గత నాలుగేళ్లుగా కెనడాలో నివసిస్తున్నారు. చదువుకుంటూనే ఖర్చుల కోసం పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నారు.

ఈ నెల‌ 15న ఈ దారుణం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే, హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కెనడా పోలీసులు హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తమ కుమార్తె విగతజీవిగా మారిందన్న వార్త తెలియడంతో విధి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -