- Advertisement -
నవతెలంగాణ – సారంగాపూర్
మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1992-93 లో చదివిన పదో తరగతి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు వారు చదువుకున్న పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం మంగళవారం ఆడెల్లి పోచమ్మ ఆలయం వద్ద జరుపుకున్నారు. ప్రస్తుతం ఎక్కడెక్కడో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థులు దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కలుసుకుని చిన్ననాటి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆత్మీయ ఆలింగనాలు.. పలకరింపుల తో సాయంత్రం వరకు ఆనందంగా గడిపారు. ఆనాటి గురువులను శాలువా పూలమాలలతో సన్మానించారు. ఈ అపురుప క్షణాలను సెల్‌ఫోనలలో బంధించారు. అనంతరం స్వపంక్తిభోజనాలు చేసారు.
- Advertisement -


