ప్రచారంలో భాగంగా గ్రామాలలో అడుగడుగున బ్రహ్మరథం పడుతున్న ప్రజలు

– చేసిన అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి- డాక్టర్ గాదరి కిషోర్ కుమార్
నవతెలంగాణ- తుంగతుర్తి: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు పూర్వం 2014లో తుంగతుర్తి నియోజకవర్గం ఎలా ఉందో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గం ఎన్ని రకాల అభివృద్ధి చెందిందో చూసి తనను ఆశీర్వదించి మళ్లీ గెలిపిస్తే నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని వెలుగుపల్లి, కేశవాపురం గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ మేరకు ఆయనకు మహిళలు ప్రజలు కోలాటాలతో డబ్బులతో, మంగళహారతులతో గజమాలతో, బొట్టు పెట్టి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలలో ప్రతిపక్షాలు ఎవరు కూడ ప్రజల కష్టసుఖాల్లో పాల్గొనలేదని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడని వారు ఎన్నికలు వస్తున్న దృష్ట్యా మోసపు మాటలతో ముందుకు వస్తున్నారని వారిని నమ్మి మోసపోయి గోస పడవద్దని అన్నారు. ఈ పది సంవత్సరాల్లో కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్ర సంపదను పేదలకు పంచిపెట్టడమే లక్ష్యంగా కేసీఆర్ అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాడని అన్నారు. ముఖ్యంగా రైతుబంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, 24 గంటల కరెంటు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, ఇంటింటికి మిషన్ భగీరథ మంచినీరు, దళిత బంధు, బీసీ బందు, గృహలక్ష్మి లాంటి పథకాలు ప్రవేశపెట్టి దేశంలోని అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకుడయ్యాడని అన్నారు. గత కాంగ్రెస్ పాలనలో ఈ ప్రాంతంలో పోచంపాడు జలాల కోసం ఉద్యమాలు జరిగాయని గుర్తు చేశారు. రాష్ట్రం సిద్ధించిన అనంతరం తన హయాంలో కాలేశ్వరం జలాలను ఎస్సారెస్పీ కాలువల ద్వారా ఈ ప్రాంతానికి రప్పించి గ్రామాలలోని చెరువులను గోదావరి జలాలతో నింపి సంవత్సరానికి రెండు పంటలు పండే విధంగా తాను కృషి చేశానన్నారు. దీంతో గతంలో వలసలకు నిలయంగా ఉన్న తుంగతుర్తి నియోజకవర్గం నీరు పుష్కలంగా ఉండడంతో వలసలకు పోయిన జనం తిరిగి ప్రాంతానికి చేరుకున్నారని అన్నారు. ఇప్పటికి ఇతర రాష్ట్రాల ప్రజలు ఇక్కడ కూలీలుగా పనిచేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఒకవైపు కాంగ్రెస్ నాయకులు అధికారం వస్తే మూడు గంటల కరెంటు ఇస్తామని చెప్తున్నారు అని కెసిఆర్ 24 గంటలు కరెంటు ఇస్తున్నాడని ప్రజలకు మూడు గంటల కరెంటు కావాలా 24 గంటల కరెంటు కావాలా మీరే తెలుసుకోవాలని కోరారు. కాంగ్రెస్కు మోసపోయి ఓటు వేస్తే రాష్ట్రం మళ్ళీ అంధకారంలోకి పోవడం ఖాయం అన్నారు. ఈ పది సంవత్సరాలలో ఏ ఒక్కరోజు కూడా నియోజకవర్గ ప్రజలను పట్టించుకోని కాంగ్రెస్, అమలుకు సాధ్యం కాని హామీలతో మీ ముందుకు వస్తున్నారని వారికి తగిన విధంగా బుద్ధి చెప్పాలని కోరారు. తనను ఆశీర్వదించి మూడోసారి గెలిపిస్తే నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో ఉన్న 15000 దళిత కుటుంబాలకు దళిత బంధు, సన్న బియ్యం, ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశంలో మరెక్కడా జరగలేదన్నారు. నియోజకవర్గంలో సాగు తాగు నీటి సమస్య లేకుండా చేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కి దక్కిందన్నారు.రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఈ ప్రాంత ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఐదు లక్షల ఆరోగ్య భీమా తో పాటు 400 రూపాయలకే సిలిండర్ ఇవ్వనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ మోసపూరితమైన గ్యారెంటీలను నమ్మితే తెలంగాణలో వచ్చేవి కష్టాలేనని అన్నారు. 2014 ముందు ఏ గ్రామంలో చూసిన స్థూపాలు గోరీలు కక్షలు గొడవలతో ఉండేదని అభివృద్ధి మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ కాపీ కొట్టి మేనిఫెస్టో విడుదల చేసిందని అన్నారు. గత 60 సంవత్సరాలుగా కాంగ్రెస్  చేయని అభివృద్ధి కేసీఆర్ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులకు సరిగా కరెంట్ రాక ఎరువులు దొరక్క ఇబ్బందులు పడ్డారని అన్నారు. కాంగ్రెస్ అంటేనే ప్రజలను మోసం చేసే పార్టీ అని అధికారం రాకముందే నేనే ముఖ్యమంత్రి  నంటూ కొట్లాటకు దిగుతున్నారని అన్నారు. గోదావరి జలాలతో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారి వేల క్వింటాళ్ల ధాన్యం పండుతుందని అన్నారు .అలా పండిన ధాన్యాన్ని ఐకెపి కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ పాలనలో 200 రూపాయలు ఉన్న పెన్షన్ను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2000 ఇస్తున్నామని అధికారంలోకి రాగానే పెన్షన్లను ఐదు వేల రూపాయలకు పెంచుతామని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు సిసి రోడ్లు హరితహారం. ఎస్సీ బీసీ కమ్యూనిటీ హాళ్లను. స్మశానవాటికలను నిర్మించామని అన్నారు. తను ఆశీర్వదించి మూడోసారి గెలిపిస్తే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య తో పాటు ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.
Spread the love