నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) విధులు నిర్వహిస్తున్న ఓటరు నమోదు అధికారులు (ఈఆర్ఓ), సహాయ ఓటరు నమోదు అధికారు (ఏఈఆర్ఓ)లకు ఒక నెల వేతనం ప్రత్యేకంగా ఇవ్వాలని డిప్యూటీ కలెక్టర్ల సంఘం (డీసీఏ) కోరింది. ఈ మేరకు తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) సుదర్శన్‌రెడ్డిని శుక్రవారం డీసీఏ అధ్యక్షులు వి.లచ్చిరెడ్డి నేతృత్వంలో కలిసి వినతిపత్రం అందజేశారు. భారత ఎన్నికల సంఘం సవరించిన దాని ప్రకారం బీఎల్ఓ, సూపర్‌వైజర్లకు పారితోషికం, ఈఆర్ఓ, ఏఈఆర్ ఓలకు గౌరవ వేతనాల అమలుపై చర్చించామని తెలిపారు. ఇదే కాకుండా సర్ విధులు నిర్వహించే ఈఆర్ఓ, ఏఈఆర్ఓలకు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయంలో ఇచ్చినట్టుగానే ఒకనెల ప్రత్యేక వేతనం కూడా ఇవ్వాలని కోరారు. 2025-26కు సంబంధించి బీఎల్ఓలు, సూపర్వై జర్లకు చెల్లించాల్సిన పారితోషికం రాష్ట్రంలో ఇప్పటివరకు అందలేదని తెలిపారు. భారత ఎన్నికల సంఘం సవరించిన దాని ప్రకారం పారితోషికం బీఎల్ఓలకు రూ.12 వేలు, సూపర్వైజర్లకు రూ.18 వేలు, ఏఈఆర్ఓ లకు రూ.25 వేలు, ఈఆర్ఓలకు రూ.30 వేల చొప్పున చెల్లించాలని కోరారు. ఎన్నికల సమయంలోనూ, ఓటరు జాబితాకు సంబంధించిన ఇతర సందర్భా లలో పనిచేస్తున్న బీఎల్ఓలు, సూపర్‌వైజర్లకు భారత ఎన్నికల సంఘం పారితోషికం (రెమ్యూనరేషన్) పెంచిందని పేర్కొన్నారు. ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలకు సైతం రెమ్యూనరేషన్ పెంచుతూ ప్రతిపాదనలు చేసిందని తెలిపారు. భారత ఎన్నికల సంఘం సవరించిన రేట్ల ప్రకారం పారితోషికం, గౌరవ వేతనాల చెల్లింపునకు అవసరమైన బడ్జెట్ కేటాయించాలని కోరారు. దీనిపై సుదర్శన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు. సాధ్యమైనంత త్వరలోనే అన్ని అంశాలపై సానుకూల నిర్ణయం వస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రాములు, మహిళా అధ్యక్షురాలు రాధా, ప్రధాన కార్యదర్శి రమేష్ పాక, రాణాప్రతాప్, హేమమాలిని, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
సర్ విధులు నిర్వహించే అధికారులకు ప్రత్యేక నెలవేతనం ఇవ్వండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



