నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 428 దరఖాస్తులు అందాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 201, రెవెన్యూ శాఖకు సంబంధించి 33, ఇందిరమ్మ ఇండ్ల కోసం 116, ప్రవాసి ప్రజావాణికి మూడు దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 75 దరఖాస్తులు అందాయి. సీఎం ప్రజావాణి ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి దరఖాస్తులు స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరించారు. కార్యక్రమంలో ఏసీపీ ఉమేందర్, ఎన్ఆర్ఐ సమన్వయ మండలి వైస్ చైర్మెన్ మంద భీంరెడ్డి, ప్రవాసి ప్రజావాణి సమన్వయకర్త బొజ్జా అమరేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సీఎం ప్రజావాణిలో 428 దరఖాస్తులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



