తెలుగును ప్రపంచ మహాసభలలో పరివ్యాప్తం చేసిన వాడు ఆహారశాస్త్రవేత్త, చరిత్రవేత్త, సంపాదకులు, విమర్శకుడు, దార్శనికుడు – ఈ పరిపూర్ణ చంద్రుని గురించి ఎంత చెప్పినా తక్కువే! ఈ ఆంధ్ర భాషాభిమాని పొందని పురస్కారం, అందుకోని గౌరవంలేదు! సంప్రదాయాలకు ప్రాణమిచ్చే ఆధునికులు.
వందపేజీల ఈ దీర్ఘకవితలో 7 ఆద్యాయాలున్నాయి. 5 పేజీల ‘ముందుమాట’గా రచయిత తెలుగమ్మకు వందనాలు తెలుపుతూ, వెలుగు ప్రముఖులను స్మరించుకుంటూ, ప్రజల ఊపిరిలో పరికితేనే భాషకు శాశ్వతత్త్వం ఉంటుందంటారు. ‘గ్రాంధికం కన్నా, సంస్కతాన వండి వార్చేకన్న, జన బాషే మిన్న’ అంటారు.
వీరు ప్రతిపాదించిన విషయాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ‘భూమిని నాగలి ముద్దాడినపుడు రాతి గూళ్ళలో దీపాలు నవ్విన రోజున/ కట్టుబట్టల కోసం జీవితపు అల్లిక నేర్చిన వేళ/వంట కుండకోసం కుమ్మరి చక్రం తిరిగినపుడు తెలుగు బాష ఆవిర్భవించిందంటారు. తెలుగు భాషకు మూలం ద్రవిడం అంటూ, ‘ద్రవిడ జనని కీర్తిగా జనించిన తెలుగమ్మ’ అంటారు. సంస్కతపు ముత్యాల హారంలో మధ్యమణి తెలుగు అంటూ ప్రశంసిస్తారు. వాల్మీకి కాసల్వను ‘మహాంద్రే’ అని సంబోధించాడని, అంచేత రాముడు తెలుగు వారి మేనల్లుడు (పే.88) అని సిద్ధాంతీకరిస్తాడు రచయిత. నిజమెంతో తెలియదు కాని రచయిత, అన్వయింపుకు అబ్బురపడాల్సిందే!
బస్సు, రైలు, కామా, కంప్యూటర్ లాంటి పదాలు అన్య భాషలకు చెందినవే అయినా కొత్త పదాలను కలుపుకుంటూ పోతేనే భాష సజీవత పెరుగుతుందంటారు. పాత నిలవాలి, ఆధునికత మెరవాలి అంటారు. మంటల వాడకంలో విచక్షణే కొలబద్ద. ఆంధ్ర ప్రాంతం వారు పంచదార, మిగతా తెలుగు వారు ‘చక్కెర’ అనటంలోని సమంజసత పోలి వున్న పదపు నానార్థాలు. ‘పెరుగు’కు ఇచ్చిన వివరణ, అప్పచ్చికి దక్షిణాది భాషల వివరణ ఆసక్తి దాయకంగా ఉంటుంది. మనకు లేని పదాలను స్వీకరించాలని (ఉదా: సెల్లు, రైలు, బస్సు) ఉన్నవాటిని పొందికగా నిలుపుకుందామన్న కంక్లూజన్ రచయిత మనో వైశాల్యతను చెబుతుంది. శీలా వీర్రాజు చేవ్రాలు (ఫాంట్)గా స్వీకరించటం రచయితకు నవ్యత్వం పట్ల వున్న ఆపేక్ష. ఒక్కరోజులోనో, నెలలోనో రాయగలిగింది కాదు ఈ ఆంధ్రగీతి. అభినందనలు.
కూరచిదంబరం, 8639338675
భాషకు భక్తి నీరాజనం, పరిపూర్ణ చంద్రోదయం
- Advertisement -
- Advertisement -



