Thursday, September 24, 2026
E-PAPER
Homeసమీక్షనవ్వత, ఆర్ధతలు జాస్తి

నవ్వత, ఆర్ధతలు జాస్తి

- Advertisement -

ప్రముఖ సాహితీవేత్త గుడిపాటి తన ‘ఇతివ్పత్తం’ పుస్తకంలో కథ స్వరూప స్వభావాలు నిర్ణయించే క్రమంలో – కథలో వస్తువు, శిల్పం రెండూ వుండాలంటారు. సమాజంలో జరిగే సంఘటనలకు స్పందన, విశ్లేషణ, సామాజిక నేపధ్యం, చరిత్ర దష్టికోణం, భవిష్యత్తును నిర్ణయించే సందేశం, రచయిత పాఠకుడిని తనతో తీసుకు పోగలిగే టెక్నిక్‌ ‘కథ’లో ఉండాలంటారు. ఆధునిక మానవుడి అంతరంగంలోని కల్లోలాలను వ్యక్తీకరించాలని ఆశిస్తారు. జాస్తి రమాదేవి ‘పందిరి పట్టెమంచం’లోని కథలు చదువుతుంటే పాఠకులుపై అనుభూతులకు లోనవుతారు. సంపుటిలోని 22 కథలూ మానవ విలువల్ని నిర్ణయించేవే! పరస్పరం అపరిచితులైనా, పురుడు పోయటం ఆమెకు తెలీకున్నా, జయలక్ష్మిలోని మాతత్వం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లిన ఆమెతో పురుడుపోయించింది. అవగాహన ఏమీ లేకున్నా, ఆమెలో బిడ్డ బొడ్డు కోయించింది. నవజాత శిశివునీ తల్లినీ శుభ్రపరచి సుఖప్రసవం అయ్యేలా చేసింది. అనుభవం అన్న డాక్టర్స్‌ చెయ్యాల్సిన పనిని ఆమెతో చేయంచగలగటం ఆమెలో దాగివున్న మాతత్వ భావవ అని చెబుతారు రచయిత్రి ‘అడవిలో ఆరోజు’ కథలో. చేతిలో చిల్లి గవ్వ లేకున్నా, డబ్బు కట్టందే ఆపరేషన్‌ చేయనన్న హాస్పిటల్‌ టేబుల్‌ మీద లక్ష పోగవుతుంది. మానవత్వం మనిషిలో ఇంకా చావలేదు. ఒక్కోసారి దీపశిఖ బలహీనమై అల్లల్లాడి పోతున్నా, తేరుకుని ప్రజ్వరిల్లుతుంది అని చెప్పే ‘గుండె చప్పుళ్ళు’ కథ. పళ్లెంలో బిర్యానీ వాసనలు ఘుమ ఘుమ లాడుతున్నాయి. మీ అమ్మకు బిర్యానీ చాలా ఇష్టం. ఓముద్ద తీసి బయటపెట్టి రామ్మా అంటున్న తండ్రితో ‘ఛాదస్తం కానీ పోయిన వాళ్లు వచ్చి తింటారంటావా?’ అన్న కూతురు జవాబుకు రాఘవయ్య స్పందన ఏమిటో ‘అమ్మ వీలునామా’ కథ చదవాల్సిందే. భార్య కోరిక మేరకు శక్తినంతా కూడగట్టుకుని, తన మనసంతా ఆ పందిరి పట్టెమంచంపై కేంద్రీకరించి, చూడముచ్చటైన పందిరిపట్టెమంచం రూపొందించాడు అప్పలాచారి. మనవరాలి పెళ్లికి అది అమ్మటం తప్ప గత్యంతరం లేకపోతే భార్య మాణిక్యాంబ కళ్లు చెలమలు కావటంలో ఆశ్చర్యం లేదు. భార్య కోరిక మేరకు మరో మంచం చేయగలుగుతాడో లేదో కానీ చేతిలోని డబ్బు ఆయనకు, భార్యకు, కొడుక్కు వేరువేరుగా కన్పిస్తుంది. తలచినవన్నీ రూపుదాల్చకపోతే నిరాశలో కూడా నవ్వు వస్తుంది. అవును నిజం. బతకాలని వుంటే ఏదైనా పాజిబుల్‌ అవుతుంది. తెల్లారనంటుంటే తెల్లగా తెల్లారటం, పూల రెక్కలు రాలినంత నిశ్శబ్దం, బ్యాంకు అప్పులు, రైతు ఆత్మహత్యలు.. అయినా (రైతుకు) వ్యవసాయం ఓ వ్యసనం.. లాంటి మంచి వాక్యాలు కథల నిండా ఉంటూ పాఠకుడికి ఉల్లాసం కలుగ చేస్తాయి.
కూరచిదంబరం, 8639338675

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -