4-1తో పరాగ్వేపై గెలుపు
ఫిఫా 2026 ప్రపంచకప్
లాస్‌ఎంజిలెస్ (యుఎస్‌ఏ) : ఫిఫా ప్రపంచకప్‌ను ఆతిథ్య అమెరికా అదిరే విజయంతో ఆరంభించింది. శనివారం లాస్‌ఏంజెలెస్‌లో జరిగిన మ్యాచ్‌లో పరాగ్వేపై యుఎస్‌ఏ 4-1తో ఘన విజయం సాధించింది. ఫోలోరిన్ బలొగన్ రెండు గోల్స్‌తో ప్రపంచకప్ మ్యాచ్‌లో ఒకటి కంటే ఎక్కువ గోల్స్ చేసిన రెండో అమెరికా ఆటగాడిగా నిలిచాడు. మ్యాచ్ మొదలైన తొలి పది నిమిషాల్లోనే అమెరికా 1-0తో ముందంజ వేసింది. కానీ గోల్ ప్రత్యర్థి మిడ్‌ఫీల్డర్ డామియన్ బొబదిల్లా చేశాడు. సెల్ఫ్‌గోల్‌తో ఆతిథ్య జట్టు గోల్ ఖాతా తెరిచిన పరాగ్వే.. ద్వితీయార్ణంలో ఓ గోల్ కొట్టింది. ఫొలొరన్ 31వ నిమిషంలో, 45+5వ నిమిషంలో గోల్స్ కొట్టాడు. మ్యాచ్ ముగయనుండగా ఆఖరు క్షణాల్లో గియోవాని రెయాన మరో గోల్‌తో మెరిశాడు. దీంతో అమెరికా 4-1తో పరాగ్వేపై ఫర్‌ఫెక్ట్ విజయం సాధించింది. గ్రూప్-డిలో బోణీ కొట్టిన అమెరికా.. తర్వాతి మ్యాచ్‌ల్లో టర్కీ, ఆస్ర్టేలియాతో తలపడనుంది. బంతిని 59 శాతం తన నియంత్రణలో నిలుపుకున్న యుఎస్‌ఏ.. 16 సార్లు గోల్ ప్రయత్నం చేసింది. పరాగ్వే ఆటగాళ్లు ఐదు ఎల్లో కార్డులు అందుకోగా..యుఎస్‌ఏకు ఓ ఎల్లో కార్డు జారీ అయ్యింది.
కెనడా, బోస్నియా మ్యాచ్ డ్రా : గ్రూప్-బిలో మరో ఆతిథ్య జట్టు కెనడా, బోస్నియా మ్యాచ్ డ్రాగా ముగిసింది. బోస్నియా 21వ నిమిషొంలోనే గోల్ కొట్టి ఆధిక్యం సాధించింది. జొవో లూకిక్ బోస్నియాకు మంచి ఆరంభం అందించాడు. 78వ నిమిషంలో సైల్ లారిన్ గోల్ సాధించటంతో కెనడా స్కోరు సమం చేసింది. ఇంజూరీ టైమ్‌లోనూ ఇరు జట్లు మరో గోల్ చేయటంలో విఫలం అయ్యాయి. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
అమెరికా శుభారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



