Sunday, May 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎడ్ సెట్ 2026 ఫలితాలు విడుదల

ఎడ్ సెట్ 2026 ఫలితాలు విడుదల

- Advertisement -

96.95 శాతం ఉత్తీర్ణత
మొదటి ర్యాంకర్ బానోత్ అజిత్ సాయి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు (టీజీ ఎడ్ సెట్ 2026s) విడుదలయ్యాయి. శనివారం హైదరాబాద్ లో ఉన్నత విద్యా మండలి చైర్మెన్ బాలకిష్టారెడ్డి, కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి ఈ ఫలితాలను వెల్లడించారు. ఎడ్‌సెట్‌ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 35,600 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 29,342 మంది హాజరయ్యారు. వీరిలో 28,446 మంది (96.95 శాతం) అభ్యర్థులు అర్హత సాధించారు. కొత్తగూడెంకు చెందిన 124.651311 మార్కులతో బానోత్‌ అజిత్‌ సాయి ఎడ్‌సెట్‌లో మొదటి ర్యాంకు సాధించారు. మొదటి 10 ర్యాంకులను అబ్బాయిలే కైవసం చేసుకున్నారు. ఫలితాల్లో పురుషుల ఉత్తీర్ణత శాతం 98.85 శాతం (హాజరైన 4,858 మందిలో 4,802 మంది క్వాలిఫై) కాగా, మహిళలు 96.57 శాతం (హాజరైన 24,482 మందిలో 23,642 మంది క్వాలిఫై) ఉత్తీర్ణత సాధించారు. అలాగే పరీక్షకు హాజరైన ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు కూడా క్వాలిఫై అయ్యారు. ఎస్సీ, ఎస్టీ క్యాటగిరీలో పురుషులు, మహిళలతో పాటు బీసీ-సీ క్యాటగిరీలో పురుషులు వంద శాతం ఉత్తీర్ణులయ్యారు. మైనారిటీల్లో సిక్కులు, ఇతర మైనారిటీలు వంద శాతం ఉత్తీర్ణులయ్యారు. స్థానికుల్లో (తెలంగాణ రాష్ట్రం నుంచి) 96.93 శాతం ఉత్తీర్ణులు కాగా, అన్ రిజర్వడ్ క్యాటగిరీలో 97.90 శాతం అర్హత సాధించారు. మే 12న రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రాంతీయ కేంద్రాల పరిధిలోని 59 పరీక్షా కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో రెండు సెషన్లలో ఈ ప్రవేశ పరీక్ష జరిగింది. ఫిబ్రవరి 20న ఈ పరీక్ష నోటిఫికేషన్ విడుదలవగా మే 15న ప్రిలిమినరీ కీని అందుబాటులో ఉంచి మే 17 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. అనంతరం నిపుణుల కమిటీ ఆమోదంతో ఫైనల్ కీ ఆధారంగా శనివారం తుది ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా చూసుకోవచ్చని అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -