రాష్ట్ర రాజకీయాలు, పార్టీ తీరు తెన్నులపై చర్చ
ఖర్గేతో సీఎం రేవంత్, కాంగ్రెస్ నేతల భేటీ
హైదరాబాద్: రాష్ట్రంలో పాలన ఎలా సాగుతుందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరా తీశారు. హైదరాబాద్ మీదుగా గుల్బర్గా వెళ్తూ .. శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఖర్గే రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీహరి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తదితరులు.. ఆప్యాయంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా రాష్ట్ర రాజకీయాల గురించి వాకబు చేశారు., పార్టీ బలోపేతానికి నేతలు కృషి చేయాలని ఈ సందర్భంగా ఖర్గే సూచించినట్టు సమాచారం.



