Saturday, June 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించిన సీఐటీయూ నాయకులు

ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించిన సీఐటీయూ నాయకులు

- Advertisement -

నవతెలంగాణ-వర్ధన్నపేట
కార్మికుల సమస్యల పరిష్కరించాలని గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో వర్ధన్నపేట ఎంపీడీవో వెంకటరమణకు సీఐటీయూ నాయకులు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల గౌరవ అధ్యక్షులు తుమ్మల సాంబయ్య, గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు గోపి మండల కమిటీ కార్యదర్శి తాటికాయల మల్లయ్యలు మాట్లాడుతూ.. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజలు రోగాల బారి నుండి కాపాడుతున్నటువంటి పంచాయతీ కార్మికులను అటువంటి పారిశుద్ధ కార్మికులను ఏళ్ల తరబడి పని చేసిన పని భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన హామీకి రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికులు హర్షం వ్యక్తం చేశారన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, పర్మినెంట్, కనీస వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ, సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. 2018 సంవత్సరంలో గత రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ సిబ్బందికి నష్టదాయకంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 51 సవరించి వందలాదిమంది పంచాయతీ కార్మికులు చావుతోనైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని ఉధ్భోదించారు. ఈ చావులకు కారణమైన మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -