- Advertisement -
నవతెలంగాణ-మిడ్జిల్
జేఈఈ అడ్వాన్స్ ఫలితాలు జడ్చర్ల పట్టణ చెందిన దళిత విద్యార్థి స్వరాగ్ ప్రతిభ చాటాడు. ఆల్ ఇండియా ఎస్సీ కేటగిరి విభాగంలో 890 ర్యాంకు సాధించాడు. విద్యార్థి తల్లిదండ్రులు సుజాత విజయభాస్కర్ ఇద్దరు మండలంలోని కంచనపల్లి, కొత్తపల్లి గ్రామాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థి ప్రతిభ చాటడం పట్ల దళిత సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజా సంఘాలు సోమవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. రాబోవు రోజుల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
- Advertisement -



