మంగలి గడ్డతాండ గ్రామపంచాయతీకి అంబులెన్స్ ఏర్పాటు చేస్తా
నవతెలంగాణ-మిడ్జిల్
హెల్మెట్ ధరించకుండా ప్రజలు వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దని గిరిజన సంఘం జిల్లా నాయకులు భాస్కర్ నాయక్ అన్నారు. రోడ్డు ప్రమాదాలతో నిత్యం వేల మంది ప్రాణాలను కోల్పోతున్నారని, అందులో ముఖ్యంగా హెల్మెట్ లేకపోవడంతోనే ఎక్కువ మంది మరణిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన నవతెలంగాణతో మాట్లాడుతూ..హెల్మెట్ లేకుండా వాహనాలను రోడ్డుపైకి తీసుకురావద్దని సూచించారు. మిడ్జిల్ మండలంలో అన్ని గ్రామాలకు 5000 హెల్మెట్లను త్వరలోనే పంపిణీ చేస్తానని చెప్పారు. మండలంలోని మంగల్ గడ్డ తండా గిరిజన ప్రజలు మా కుటుంబంలో సర్పంచిగా మా అన్న చంద్రు నాయక్ గిరిజన ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించినందుకు తండా ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని చెప్పారు.
మారుమూల గ్రామాల్లో ఉన్న తాండాల నుండి మండల కేంద్రానికి రావాలంటే రహదారులు లేక ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని, ఆరోగ్యం బాగా లేనప్పుడు ఆస్పత్రికి వెళ్లాలంటే వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారని అన్నారు. మంగలిగడ్డ తాండ గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని తాండాలకు సొంతంగా అంబులెన్స్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. మిడ్జిల్ మండల అభివృద్ధి కోసం తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. రాజకీయాలకతీతంగా అందరి సహకారంతో అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని, ప్రజలు ఆశీర్వదిస్తే రాజకీయాల్లో కూడా వస్తానని చెప్పారు.
గ్రామాలకు దూరంగా అడవులలో ఉంటున్న గిరిజన తాండాలకు రహదారులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. యువకులు రాజకీయ చైతన్యం కలిగి ఉండాలని, రాబోవు రోజుల్లో తండాల్లో, గ్రామాలు, మండలాలలో యువకులే రాజ్యాధికారంలో ముందుండాలని కోరారు. బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వాల్య నాయకుని హైదరాబాదులోని తన కార్యాలయంలో శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించినట్లు చెప్పారు.


