మాజీ ఎంపీపీ తోకల వెంకన్న
నవతెలంగాణ – చండూరు
క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి దోహదపడతాయని మాజీ ఎంపీపీ తోకల వెంకన్న అన్నారు. ఇటీవల జిల్లా పరిషత్ హై స్కూల్ లో కింగ్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో తన తండ్రి తోకల లక్ష్మయ్య జ్ఞాపకార్థం నిర్వహించిన క్రికెటర్ టోర్నమెంట్లో భాగంగా ఫైనల్ లో గెలుపొందిన టీమ్స్ కి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినీ, విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించి జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి మంచిపేరు తీసుకురావాలన్నారు.
ప్రతి ఓటమి మరో గెలుపునకు నాంది పలుకుతుందని, పోటీల్లో ఓడిన వారు నిరుత్సాహం చెందకుండా రాబోయే ఆటల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలన్నారు. విద్య అనేది మనిషికి జ్ఞానాన్ని ఇచ్చి ఎలా మెరుగుపరుస్తుందో అదే విధంగా క్రీడలు కూడా మన జీవితానికి ఎన్నో పాఠాలు నేర్పిస్తాయన్నారు. విద్యతో పాటు క్రీడలు కూడా మనలో భాగస్వామ్యం అయినప్పుడు పరిపూర్ణత గల మనిషిగా అభివృద్ధి చెందుతారన్నారు. ఈ కార్యక్రమంలో బొబ్బల రాంరెడ్డి , భూతరాజు వెంకన్న , కింగ్ స్టార్ అధ్యక్షులు తుమ్మడగొని మలేష్ , భూతరాజు శంకర్, భూతరాజు సామేష్ , ఆర్గనైజేరస్ పేర్ల గణేష్, దోమల స్వామి, తదితరులు పాల్గొన్నారు.



