Tuesday, June 2, 2026
E-PAPER
Homeబీజినెస్నాలుగో రోజూ నష్టాలు..

నాలుగో రోజూ నష్టాలు..

- Advertisement -

 సెన్సెక్స్‌కు 508 పాయింట్ల నష్టం
ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా నాలుగో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ నష్టాలను చవి చూశాయి. సోమవారం ఉదయం లాభాలతో ఆశాజనకంగా ప్రారంభం కాగా.. ఇంట్రాడేలో గరిష్ఠాలను తాకినప్పటికీ.. మదుపర్లు అనుహ్యాంగా అమ్మకాలకు దిగడంతో ఆరంభ లాభాలన్నీ ఆవిరయ్యాయి. పశ్చిమాసియాలో నెలకొన్న శాంతిపై అనిశ్చితి, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల విక్రయాలు కొనసాగుతుండడం మార్కెట్‌ను దెబ్బతీశాయి. ముఖ్యంగా ఎఫ్ఎంసిజి, పిఎస్‌‌యు బ్యాంక్‌ రంగాల స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా కనిపించింది. ఈ పరిణామాలతో తుదకు బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 508.40 పాయింట్ల నష్టంతో 74,267.34‌కు పరిమితమయ్యింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 165.15 పాయింట్లు నష్టపోయి 23,383 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 30 సూచీలో హిందుస్థాన్‌ యూనిలీవర్‌, ఐటిసి, ఎన్‌‌టిపిసి, మహీంద్రా అండ్‌ మహీంద్రా, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు నష్టపోగా.. టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, టిసిఎస్‌, ఇండిగో, హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు లాభపడ్డాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -