Monday, June 22, 2026
E-PAPER
Homeబీజినెస్సోలార్‌ ఉత్పత్తులు భారం

సోలార్‌ ఉత్పత్తులు భారం

- Advertisement -

న్యూఢిల్లీ : సోలార్ సెల్స్ దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం సోమవారం నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తేవడంతో రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకునే వినియోగదారులపై అదనపు భారం పడనుంది. చైనా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పిఎం సూర్యఘర్ పథకంతో పాటు కమర్షియల్ ఓపెన్ యాక్సెస్ ప్రాజెక్టులకు కూడా దేశీయంగా తయారైన సోలార్ సెల్స్, మాడ్యూల్స్‌నే వాడాలని కేంద్రం తప్పనిసరి చేసింది. ప్రస్తుతం దేశీయంగా ఏటా 50గిగావాట్‌ సోలార్ సెల్స్ అవసరం ఉండగా, ఉత్పత్తి సామర్థ్యం 25-30గిగావాట్‌ మాత్రమే ఉండటం వల్ల తాత్కాలికంగా కొరత ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. విదేశీ దిగుమతుల కంటే స్వదేశీ సోలార్ సెల్స్ ధర ఎక్కువగా ఉండటం వల్ల ఇకపై రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్ ధర కిలోవాట్‌కు సుమారు రూ.3,000 వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనివల్ల 5 కిలోవాట్ల సిస్టమ్‌ ఏర్పాటుకు వినియోగదారులు అదనంగా రూ.15,000 వరకు చెల్లించాల్సి రావచ్చునని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -