Wednesday, June 3, 2026
E-PAPER
Homeజాతీయంసీఎంగా డీకే శివకుమార్ ప్ర‌మాణ‌స్వీకారం

సీఎంగా డీకే శివకుమార్ ప్ర‌మాణ‌స్వీకారం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: క‌ర‌్నాట‌క సీఎంగా డీకే శివకుమార్ ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. బుధవారం బెంగళూరులోని లోక్ భవన్‌లో ఆయనతో కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించారు. మరో 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర కూడా ఉన్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎంగా పరమేశ్వర ప్రమాణ స్వీకారం చేశారు.

డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి ముందు పీఠాధిపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తదితరులు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -