ఈనెలాఖరు వరకు దరఖాస్తు గడువు
మోడల్ స్కూల్ అదనపు సంచాలకులు శ్రీనివాసాచారి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 2026-27 విద్యాసంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశాలతోపాటు ఏడు నుంచి పదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే గడువు ఈనెల 28వ తేదీ వరకు ఉందని ప్రభుత్వం తెలిపింది. మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 19న నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ మేరకు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకులు ఎస్ శ్రీనివాసాచారి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుందని తెలిపారు.
ఆరో తరగతిలో ప్రతి పాఠశాలలో వంద సీట్లు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఏడు నుంచి పదో తరగతి వరకు ఖాళీ సీట్లను భర్తీ చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు 8,025 మంది ఫీజు చెల్లించారనీ, 7,578 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారని పేర్కొన్నారు. ఇంకా 447 మంది దరఖాస్తులను సమర్పించాల్సి ఉందని తెలిపారు. ఎస్సీ,ఎస్టీ బీసీ, వికలాంగులు, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు రూ.125, ఇతరులు రూ.200 దరఖాస్తు ఫీజు చెల్లించాలని కోరారు. ఇతర వివరాల కోసం వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు 7,578 దరఖాస్తులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



