Wednesday, June 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బడిబాట పేద విద్యార్థులకు భవిష్యత్తుకు బంగారు బాట

బడిబాట పేద విద్యార్థులకు భవిష్యత్తుకు బంగారు బాట

- Advertisement -

– సర్పంచ్ అబ్దుల్ రషీద్..
నవతెలంగాణ – ఊరుకొండ 

ప్రభుత్వ పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమం పేద విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట అని ఊరుకొండ పేట సర్పంచ్ అబ్దుల్ రషీద్ అన్నారు. బుధవారం ఊరుకొండ మండలంలోని ఊరుకొండ పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మండల విద్యాధికారి అబ్దుల్ రహీం అధ్యక్షతన బడిబాట వాల్ పేపర్లు విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సర్పంచ్ అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని.. పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం తదితర వసతులు ఉంటాయని ప్రతి ఒక్కరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి నాణ్యమైన విద్య అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రేపని శ్రీనివాసులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -