Wednesday, June 3, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ఉపాధి హామీలో పానది రోడ్ల నిర్మాణం చేపట్టండి

ఉపాధి హామీలో పానది రోడ్ల నిర్మాణం చేపట్టండి

- Advertisement -

సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ 
నవతెలంగాణ – ముధోల్ 

ఉపాధి హామీ పథకంలో వ్వవసాయ చేనులకు వెళ్లే పానది రోడ్ల నిర్మాణం చేపట్టాలని పలు మార్లు చేపినప్పటికి అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడం సరికాదని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల అన్నారు. బుధవారం ముధోల్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయా మండలాల ఉపాధి హామీ, అధికారులు, సిబ్బంది చే సమీక్షా సమావేశం నిర్వహించారు.   సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి మండలానికి రోడ్ల నిర్మాణం కోసం కోట్లాది రూపాయల నిధులు మంజూరైనప్పటికీ ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ లు, ఫీల్డ్ అసిస్టెంట్ లు నిర్లక్ష్యం ప్రదర్శించడం సరి కాదన్నారు.

కొన్ని మండలాల్లో గ్రామాల్లో రైతులకు తాను పలు మార్లు వివరించి చెప్పగా రోడ్ల పనులు పూర్తి కావడం జరిగిందని, ఆ పనులు పూర్తి చేయించిన అధికారులను అభినందించారు. రెండు సంవత్సరాలనుండి పానాది రోడ్ల పై దృష్టి పెడితే కేవలం 25 శాతం పనులు మాత్రమే పూర్తి అయ్యాయని అన్నారు. కనీసం 15 రోజుల్లో అయినా ఉపాధి హామీ గ్రావెల్ రోడ్ల పనులను వేగవంతం చేయాలన్నారు. గ్రామీణ అభివృద్ధి కి ఉపాధి పథకం లో కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తుందని చెప్పారు. ఎన్ని పనులు పూర్తి చేశారు, మిగత పనులు సంగతేంటి సమగ్ర నివేదికను తనకు ఇవ్వాల్సిందింగా సూచించారు. సమావేశంలో డి. ఆర్. డి. ఎ. పి. డి. విజయలక్ష్మి, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -