నెల్లికుదురు చేస్తే చిర్రా రమేష్ బాబు చేతుల మీదుగా కరపత్రం ఆవిష్కరణ
పార్వతమ్మ గూడెం ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం నరేందర్
నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని పార్వతమ్మ గూడెం మండల ప్రాథమిక ఉన్నంత పాఠశాలలో ఆచార్య జయశంకర్ బడి బాట కార్యక్రమం ప్రారంభించినట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హెచ్ నరేందర్ కుమార్ తెలిపారు. బుధవారం ఎస్ఐ చిరా రమేష్ బాబు చేతుల మీదుగా బడిబాట కరపత్రాన్ని ఆవిష్కరించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఉచిత పుస్తకాలు నోటుబుక్కులు సంబంధించినవి అందుబాటులో ఉన్నాయని ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలలోనే చేరాలని అన్నారు. ఈ పార్వతమ్మ గూడెం పాఠశాలలో నర్సరీ నుండి ఏడవ తరగతి వరకు ఆంగ్లంలో బోధనా నిర్వహించబడునని దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లి డబ్బులు హెచ్చించి ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ గ్రామంలో ఈ పాఠశాలలో ఆంగ్లo బోధిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
బడిబాట కార్యక్రమం ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



