- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్ధులకు, ఇంప్రూవ్‌మెంట్ రాయాలనుకునే వారికి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు జూన్ 12 వరకు కొనసాగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 31,542 మంది విద్యార్ధులు 93 పరీక్షా కేంద్రాల్లో హాజరవుతారని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కందిమళ్ల లింగయ్య తెలిపారు. పరీక్షలు రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతాయి.
- Advertisement -



