Thursday, June 4, 2026
E-PAPER
Homeకరీంనగర్కాలుష్య నియంత్రణపై విద్యార్థులకు అవగాహన

కాలుష్య నియంత్రణపై విద్యార్థులకు అవగాహన

- Advertisement -

నవతెలంగాణ-రాయికల్
ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రాయికల్ అటవీ కార్యాలయంలో గురువారం పర్యావరణ పరిరక్షణ, నీటి మరియు వాయు కాలుష్యం, వాటి దుష్పరిణామాలు, నియంత్రణ చర్యలపై స్థానిక విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను వివరించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో తమ వంతు బాధ్యతను గుర్తించి ప్రకృతి సంరక్షణకు కృషి చేయాలని అటవీ అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో రాయికల్ అటవీ క్షేత్ర అధికారి టి.భూమేష్,డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పద్మ,ఎఫ్‌ఎస్‌వో రత్నమ్మ, శ్రీనివాస్,బీట్ ఆఫీసర్లు రమణారెడ్డి, రత్నాకర్,సంధ్య,కవిత,విజయ, ఇలియాజ్‌తో పాటు బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -