కాటారం సిఐ నాగార్జున రావు
నవతెలంగాణ – మల్హర్ రావు
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కాటారం సిఐ నాగార్జున రావు సూచించారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం తాడిచెర్ల పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ బండి స్వామి అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభకు సిఐ,ఎంపిడిఓ క్రాoతి కుమార్,తహశీల్దార్ రవికుమార్ హాజరై మాట్లాడారు రాభోవు వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ,జల సంరక్షణ,డ్రగ్స్ నియత్రన,ట్రాఫిక్ రూల్స్, వ్యవసాయం ఇతరత్ర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి శ్రీజ,ఏపీఎం హనుమంతరావు, ఇరిగేషన్, విద్యుత్ అధికారులు,ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు,కార్యదర్శి మల్లిఖార్జున రెడ్డి,వార్డు సభ్యులు వొన్న తిరుపతి రావు,ఇందారపు చెంద్రయ్య, సారయ్య,ప్రజలు పాల్గొన్నారు.
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



