Thursday, June 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి 

గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి 

- Advertisement -

మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు 
నవతెలంగాణ-మిడ్జిల్ 

గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా సర్పంచులు, ఉపసర్పంచులు వార్డు మెంబర్లు, మండల శాఖ అధికారులు పనిచేయాలని మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు చెప్పారు. గురువారం మండల కేంద్రంతోపాటు, వెలుగొమ్ముల, అయ్యవారిపల్లి, వ స్పల, వాడ్యాల్, వేముల, గ్రామాలలో సర్పంచులు ఎడ్ల శంకర్ ముదిరాజ్, సువర్ణమ్మ, రాములమ్మ, చంద్రయ్య గౌడ్, నాగమ్మ ఆంజనేయులు అధ్యక్షతన ఏర్పాటుచేసిన గ్రామసభలలో ఆయా  గ్రామాల ప్రత్యేక అధికారులు పాల్గొని మాట్లాడారు. గ్రామంలో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించే విధంగా సర్పంచులు కృషి చేయాలని పేర్కొన్నారు.

నకిలీ విత్తనాలు అమితే సర్పంచ్లు, రైతులు అధికారులకు సమాచారాన్ని అందించాలని, సేంద్రీయ ఎరువుల వాడాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ రాఘవేందర్ రెడ్డి, ఎంపీడీవో గీతాంజలి, ఎంపీ ఓ రాజశేఖర్ రెడ్డి, వ్యవసాయ అధికారి సిద్ధార్థ, సూపర్డెంట్ ఆనంద్, ఆయా గ్రామ ఉపసర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు గ్రామస్తులు మహిళా సంఘ సభ్యులు మండల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -