నవతెలంగాణ-హైదరాబాద్: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానంద రెడ్డి (KBR) జాతీయ పార్కు ఎదుట పౌరుల బృందం ఆందోళన చేపట్టింది. పార్కు చుట్టూ రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలనే నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంతకుముందు మే నెలలో, హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానంద రెడ్డి (KBR) జాతీయ పార్కు చుట్టూ ఉన్న పర్యావరణ సున్నిత ప్రాంతంలో చెట్లను నరకడంపై సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే.జస్టిస్ బి.వి. నాగరత్న మరియు జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మధ్యంతర ఆదేశాలను జారీ చేస్తూ, పార్కు చుట్టూ ఉన్న 25 నుండి 35 మీటర్ల పరిధిలోని పర్యావరణ సున్నిత ప్రాంతంలో ఎటువంటి చెట్లనూ నరకకూడదని ఆదేశించింది.
KBR ఎదుట పౌరుల బృందం నిరసన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



