నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులు కదంతొక్కారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని భారీ యోత్తున్న నిరసన ప్రదర్శన చేపట్టారు. టీవల జరిగిన నీట్ 2026 పేపర్ లీక్ మరియు సీబీఎస్ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) వ్యవస్థలో జరిగిన అవకతవకలపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదించారు. “ధర్మేంద్ర ప్రధాన్ ఇస్తిఫా దో (ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోండి). మేము ‘మేక్ ఇన్ ఇండియా’ అడిగితే, మీరు మాకు ‘లీక్ ఇన్ ఇండియా’ ఇచ్చారు” అంటూ అభిజీత్ దీప్కే ధ్వజమెత్తారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అమెరికాలోని బోస్టన్ నుంచి న్యూఢిల్లీకి వచ్చారు. నిరసన ప్రదర్శనలో ఓ చేతిలో జాతీయ జెండా, మరో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆత్మకథ పుస్తకాన్ని పట్టుకుని నిరసన తెలిపారు. వారితో పాటు పర్యావరణ కార్యకర్త వాంగ్ చుంగ్ ఉన్నారు. శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు సీజేపీకి ఢిల్లీ పోలీసులు అనుమతి మంజూరు చేశారు.





