నవతెలంగాణ – హైదరాబాద్: ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ అద్భుత శతకంతో మెరిశాడు. అయితే, సెంచరీ పూర్తి చేసుకున్న ఆనందం అతనికి ఎంతోసేపు నిలవలేదు. శతకం బాదిన మరుసటి బంతికే పెవిలియన్ చేరి తీవ్ర నిరాశతో వెనుదిరిగాడు. టెస్టుల్లో ఇలా సెంచరీ పూర్తికాగానే ఔటవ్వడం రాహుల్‌కు ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం.
చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు ఆటలో భారత బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ఓపెనర్ రాహుల్ (100) సెంచరీకి తోడు, యువ ఆటగాడు సాయి సుదర్శన్ (81), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (65 బ్యాటింగ్) అర్ధశతకాలతో రాణించారు. దీంతో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.



