Saturday, June 6, 2026
E-PAPER
Homeఆటలుఆఫఘనిస్థాన్‌తో వన్డే సిరీస్‌..యశస్వీ జైస్వాల్‌ చాన్స్‌

ఆఫఘనిస్థాన్‌తో వన్డే సిరీస్‌..యశస్వీ జైస్వాల్‌ చాన్స్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైదరాబాద్ : ఆఫఘనిస్థాన్‌తో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌కు విరాట్ కోహ్లీ స్థానంలో యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌ను భారత జట్టులోకి ఎంపిక చేశారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఈ విషయాన్ని ప్రకటించారు. జైస్వాల్ తన చివరి వన్డేలో సౌతాఫ్రికాపై అజేయ సెంచరీ సాధించాడు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ క్లియరెన్స్‌పై ఆధారపడి ఆడతారు. కోహ్లీ తొడ కండరాల గాయంతో ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. జూలైలో ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు కోలుకునే అవకాశం ఉంది. భారత్, ఆఫఘనిస్థాన్‌ల మధ్య వన్డే సిరీస్ జూన్ 13న ధర్మశాలలో ప్రారంభమవుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -