- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: దేశంలో మరో హైస్పీడ్ బుల్లెట్ రైళును పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం కీలక ప్రకటన చేశారు. శనివారం కోల్కత్తాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా సిలిగురిని ఢిల్లీలో అనుసంధానం చేసేందుకు బుల్లెట్ రైలు ప్రాజెక్టు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణానికి 20 గంటల సమయం పడుతుంది. అయితే బుల్లెట్ రైళ్ల ప్రాజెక్ట్ వల్ల 6 గంటలకు తగ్గనుంది.
- Advertisement -



