Wednesday, August 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతి గ్రామంలో యూరియా నియంత్రణకు నిగ్రణి సమితిలు ఏర్పాటు

ప్రతి గ్రామంలో యూరియా నియంత్రణకు నిగ్రణి సమితిలు ఏర్పాటు

- Advertisement -

వ్యవసాయ అధికారి విజయ్ కుమార్
నవతెలంగాణ-వర్ధన్నపేట
గ్రామస్థాయి నుండి యూరియా వినియోగం, నియంత్రణపై నిగ్రణి సమితి ప్రత్యేక కమిటీ ఉంటుందని, వర్ధన్నపేట వ్యవసాయ అధికారి విజయ్ కుమార్ తెలిపారు. వర్ధన్నపేట మండల పరిధిలోని ఇల్లంద, కడారిగూడెం గ్రామాలలో ఆయా గ్రామాల సర్పంచ్ ల అధ్యక్షతన జరిగిన గ్రామ సభలలో పాల్గొన్న వ్యవసాయ అధికారి యూరియా వినియోగం, నియంత్రణపై రైతులకు కీలక సమాచారాన్ని అందించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి విజయకుమార్ మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో అవసరాల మేరకే యూరియా వినియోగంతో పాటు నియంత్రణ కోసం నిగ్రని సమితీలు పనిచేస్తాయన్నారు. గ్రామస్థాయిలో ఏర్పాటు చేస్తే ఈ సమితిలలో గ్రామ సర్పంచ్, ఏఈఓ, పంచాయతీ కార్యదర్శి, పిఎసిఎస్ డైరెక్టర్, సేంద్రియ వ్యవసాయ రైతు, పలువురు సభ్యులకు ఏర్పాటైన నీగ్రని సమితి పనిచేస్తుందన్నారు.

ప్రధానంగా ఈ సమితి యూరియా వినియోగంతో పాటు తప్పుదారి పట్టకుండా ఉండేందుకు, నియంత్రణకు ఈ నిగ్రోనికి సమితి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుత 2026-27 వ్యవసాయ సంవత్సరంలో ఎల్-నినో ప్రభావం కారణంగా సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. రైతులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. తక్కువ నీటి అవసరం ఉండే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలన్నారు ప్రతి గ్రామంలో ఎరువుల వినియోగం నియంత్రణను సమర్థవంతంగా అమలు చేయుటకు “నిగ్రాని సమితులు” ఏర్పాటు చేస్తున్నాము అని తెలిపారు. గ్రామస్థాయిలో ఎరువుల సరఫరా, వినియోగంపై అవగాహన కల్పించడం, అవసరానికి అనుగుణంగా ఎరువుల పంపిణీ నియంత్రణ చర్యలను పర్యవేక్షించడం వంటి బాధ్యతలను ఈ కమిటీ నిర్వహిస్తుందని గ్రామ సభలలో ఆయన వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -