Saturday, June 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలురేపు తెలంగాణకు భారీ సూచన

రేపు తెలంగాణకు భారీ సూచన

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు వాతావరణం అనుకూలిస్తోంది. ఈ క్రమంలో జూన్ 7న రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరిక జారీ చేసింది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఐఎండీ వెల్లడించిన తాజా బులెటిన్ ప్రకారం.. నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అలాగే, రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లోనూ పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -