నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి సింగిల్ విండో ఆధ్వర్యంలో కంది మద్దతు ధర కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. ఈ సందర్భంగా డోంగ్లి సింగిల్ విండో కార్యదర్శి బి బాబురావు మాట్లాడుతూ.. కంది పంట రైతులు ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాని అన్నారు. కంది పంట క్వింటాలుకు మద్దతు ధర రూ.8 వేలు కల్పించినట్లు తెలిపారు. నేషనల్ కో-ఆపరేటివ్ కన్స్మర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎన్సిసిఎఫ్ అలాగే తెలంగాణ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య మార్క్ఫెడ్ ద్వారా డోంగ్లి సింగిల్ విండో ఆధ్వర్యంలో కొనుగోలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డోంగ్లి తహశీల్దార్ రవీందర్, మోనిటరింగ్ అధికారి అబ్దుల్ హలీం, ఏఈఓ శివలింగ, డోంగ్లి సొసైటీ సెక్రటరీ బి బాబురావు, డోంగ్లి సింగిల్ విండో సిబ్బంది కంది పంట రైతులు పాల్గొన్నారు.
డోంగ్లిలో కంది కొనుగోలు కేంద్రం ప్రారంభం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



