కావలసిన వస్తువులు: ప్లాస్టిక్ బాటిల్, హ్యాండ్ గ్లోవ్ , కత్తెర, నీరు నింపిన పాత్ర, టేపు.
ప్రయోగము చేయు విధానం: ప్రియమైన విద్యార్థినీ విద్యార్థులారా… కత్తెర సహాయంతో ఏదైనా పొడవుగా ఉన్న ప్లాస్టిక్ బాటిల్ యొక్క అడుగు భాగమును కత్తిరించుకోవాలి. కత్తిరించుకున్న తర్వాత బాటిల్ యొక్క మూతి భాగంలో హ్యాండ్ గ్లోవ్ ను అమర్చుకోవాలి. అమర్చుకున్న తర్వాత నీరు ఉన్న పాత్రలో బాటిల్ ముంచి ఏమి జరుగుతుందో గమనించండి.
ప్రయోగ వివరణ: మన చుట్టూ గాలి ఆక్రమించి ఉంటుంది. నీళ్లు లేని బాటిల్లో ఏమీ లేదనుకుంటాం, కానీ అందులో గాలి నిండి ఉంటుంది. ఈ ప్రయోగంలో బాటిల్ నీరు ఉన్న పాత్రలో ముంచినప్పుడు, నీరు బాటిల్ లోపలికి వస్తుంది. అప్పుడు బాటిల్లో ఉన్న గాలి హ్యాండ్ గ్లోవ్లోకి వచ్చి హ్యాండ్ గ్లోవ్ ఉబ్బుతుంది. ఈ ప్రయోగం ద్వారా గాలి ఖాళీ స్థలాన్ని ఆక్రమించుకుంటుంది అని తెలుస్తుంది.
– వాలుగొండ వెంకటేశ్వర్లు,
సైన్స్ ఎంటర్టైనర్, 9640053470



