నవతెలంగాణ – సదాశివనగర్
ఈ నెల 15న సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నట్టు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు సురేందర్ రాథోడ్ పేర్కొన్నారు. ఈ వేడుకలకు జిల్లాలోని అన్ని గిరిజన సంఘ సభ్యులు హాజరుకావాలని కోరారు. దేశవ్యాప్తంగా ఉన్న 16 కోట్ల మంది గిరిజనులకు సేవాలాల్ మార్గదర్శి, ఆదర్శప్రాయుడని కొనియాడారు. సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇల్జిపూర్ శివారులో జగదంబమాత,సేవాలాల్ ఆలయ ప్రాంగణం వద్ద మహా భోగ్ బండర్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో బంజారా నాయకులు,ఆయా గిరిజన సంఘాల నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయక్, జిల్లా యూత్ అధ్యక్షుడు శంకర్ నాయక్, రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు,కామారెడ్డి డివిజన్ అధ్యక్షుడు సదర్ నాయక్, కామారెడ్డి టౌన్ అధ్యక్షుడు దేవునాయక్, కార్యదర్శి రమేష్ నాయక్, సదాశివనగర్ మండల ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, శ్రీనివాస్ నాయక్, బాలు, నాజం, విజయ్ తదితరులు పాల్గొన్నారు.



