నవతెలంగాణ-హైదరాబాద్: లెబనాన్ కాల్పుల విరమణ ఒప్పందాని ఇజ్రాయిల్ పదే పదే ఉల్లంఘిస్తున్న విషయం తెలిసిందే. లెబనాన్ ఆర్మీ పెట్రోల్ బంకుపై ఇజ్రాయిల్ దాడలు చేసింది. ఈ దాడిలో ఇద్దరు అధికారులు, ఒక సైనికుడు మరణించారు. తాజాగా ఈ దాడులను ఖతార్ దేశం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదిగా పేర్కొంది. లెబనాన్‌పై పదేపదే చేస్తున్న దాడులను ఆపాలని ఒత్తిడి తేవాలని, అంతర్జాతీయ ఒడంబడికలు, చట్టాలను గౌరవించేలా ఇజ్రాయిల్‌ను జవాబుదారీగా చేయాలని, భద్రతా మండలి తీర్మానం (1701)ను పూర్తిగా అమలు చేయాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ఈ దాడులు లెబనాన్ సార్వభౌమాధికారం, అంతర్జాతీయ చట్టాలను ఇజ్రాయిల్ యదేచ్ఛేగా ఉల్లంఘిస్తోందని విమర్శించింది.
లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడులు..ఖండించిన ఖతార్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



