Sunday, June 7, 2026
E-PAPER
Homeజాతీయంరాజస్థాన్‌లో ఉగాండా మ‌హిళ‌కు ఎబోలా నెగిటివ్

రాజస్థాన్‌లో ఉగాండా మ‌హిళ‌కు ఎబోలా నెగిటివ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైర‌స్ విజృంభిస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో ప్ర‌పంచ దేశాలు అప్ర‌మ‌త్త‌మైయ్యాయి. ఎయిర్‌పోర్టుల్లో ప్ర‌త్యేక త‌నిఖీలు ఏర్పాటు చేశారు. తాజాగా రాజ‌స్థాన్‌లోని జైపూర్‌లో ఉగాండా దేశానికి చెందిన‌ ఓ మ‌హిళకు ఎబోలా వైర‌స్ ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. జైపూర్‌లోని RUHS ఆసుపత్రిలో చేర్చి ప్రత్యేక గదిలో (ఐసోలేషన్‌లో) ఉంచారు. తాజాగా ఆమె నమూనాలను పరీక్ష కోసం పుణెలోని ఒక ప్రత్యేక ప్రయోగశాలకు పంపారు. పుణె నుండి వచ్చిన పరీక్షా ఫలితాలు, ఆమెకు ఎబోలా వైరస్ సోకలేదని నిర్ధారించాయి. ఈ మేర‌కు ఆదివారం ఆ రాష్ట్ర వైద్య విభాగం పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -