నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారంతో ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లుగా కళాశాల ప్రిన్స్ పల్ విజయదేవి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు ఈనెల 2 నుండి మొదలైన వృత్తి విద్య ఇంటర్ ప్రయోగ పరీక్షలు 6న ముగియగా 7 నుండి మొదలైన జనరల్ సైన్స్ విద్యార్థులకు సోమవారంతో ముగిసినట్లుగా తెలిపారు.
కాగా వృత్తి విద్య ప్రయోగ పరీక్షలకు మొత్తం 42 మంది విద్యార్థులకు గాను 39 మంది విద్యార్థులు హాజరవ్వగా ముగ్గురు విద్యార్థులు అన్ని పరీక్షలకు గైరాజరయ్యారని,అలానే జనరల్ ప్రయోగ పరీక్షలకు 47 మంది విద్యార్థులకు గాను 46 మంది విద్యార్థులు హాజరయ్యారు ఒక విద్యార్థి గైరాజరయ్యారని తెలిపారు.పరీక్షలు మొత్తం కూడా సీసీ కెమెరాల నిఘాలో ప్రశాంతంగా జరిగినట్టు తాడిచర్ల కళాశాల ప్రయోగ పరీక్షల సెంటర్ చీఫ్ సూపరిండెంట్ వెంకట్ రెడ్డి తెలిపారు కాగా ఈనెల 25 నుండి వార్షిక పరీక్షలు మొదలుకానున్నాయని పేర్కొన్నారు.



