Sunday, June 7, 2026
E-PAPER
Homeజాతీయంగ్యాస్ ధ‌ర‌లు పెంపు..కాంగ్రెస్ ఎంపీ విమ‌ర్శ‌లు

గ్యాస్ ధ‌ర‌లు పెంపు..కాంగ్రెస్ ఎంపీ విమ‌ర్శ‌లు

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్: డొమెస్టిక్‌ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ను రూ.29 మేర బీజేపీ ప్ర‌భుత్వం పెంచిన విష‌యం తెలిసిందే. 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.913 నుంచి రూ.942కు చేరింది. పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. మూడు నెలల వ్యవధిలో డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర పెరగడం ఇది రెండోసారి. పదే పదే గ్యాస్ ధ‌ర‌ల‌ పెంపుపై కాంగ్రెస్ ఎంపీ మ‌నోజ్ తివార్ సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా విమ‌ర్శ‌లు గుప్పించారు.ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (OMCలు) భారీ లాభాలను ఆర్జిస్తున్నప్పటికీ, ఎల్పీజీ (LPG) ధరలను పదేపదే ఎందుకు పెంచుతున్నార‌ని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

“చమురు మార్కెటింగ్ సంస్థలు భారీ లాభాలు ఆర్జిస్తుండగా ఎల్పీజీ ధరలను ఎందుకు పదేపదే పెంచుతున్నారు? ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (OMCలు) 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారీ లాభాలను గడించాయి. ఈ మూడు OMCలు కలిసి రూ. 77,280.65 కోట్ల లాభాన్ని ఆర్జించాయి, ఇది 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 130 శాతం అధికం,” అని మనీష్ తివారీ తన ‘X’ పోస్ట్‌లో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -