Wednesday, February 11, 2026
E-PAPER
Homeసినిమాచాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి

చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి

- Advertisement -

‘జాతిరత్నాలు’తో హాస్య చిత్రాలలో కొత్త పంథా తెచ్చిన దర్శకుడు కె.వి. అనుదీప్‌. ఆయన ఇప్పుడు ‘ఫంకీ’తో మరోసారి థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించడానికి వస్తున్నారు.
విశ్వక్‌ సేన్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో కయాదు లోహర్‌ కథానాయిక. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఒకరోజు ముందుగా ఈనెల 13న రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు కె.వి.అనుదీప్‌ మీడియాతో ముచ్చటించారు.
‘ఈ తరం అభిరుచులకు తగ్గట్టుగా ఉంటుందని ‘ఫంకీ’ టైటిల్‌ను ఎంచు కున్నాం. విశ్వక్‌సేన్‌ ఇందులో ఒక సినిమా దర్శకుడి పాత్రలో కనిపిస్తారు. ‘జాతిరత్నాలు’తో పోలిస్తే ఈ చిత్రం పూర్తి కొత్తగా ఉంటుంది. ఇది అవుట్‌ అండ్‌ అవుట్‌ రొమాంటిక్‌ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌. ఇందులో దర్శకుల జీవితాల్లో జరిగే కొన్ని సంఘటనలను సాధారణ ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా సరదాగా చూపించడం జరిగింది. అలాగే ప్రేమ కథతో పాటు కుటుంబానికి సంబంధించిన మంచి భావోద్వేగ సన్నివేశాలు కూడా ఉంటాయి. నిజ జీవితంలో ప్రేక్షకులను కనెక్ట్‌ అయ్యే సీన్స్‌ ఉంటాయి. ఇందులో కొన్ని సర్‌ప్రైజ్‌లు కూడా ఉంటాయి. నాతోపాటు దర్శకులు హరీష్‌ శంకర్‌, కళ్యాణ్‌ శంకర్‌, నిర్మాతలు దిల్‌ రాజు, నాగవంశీ అతిథి పాత్రల్లో కనిపిస్తారు.నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో త్రివిక్రమ్‌ సినిమా చూశారు. ఆయనకు సినిమా నచ్చింది. కొన్ని విలువైన సూచనలు చేశారు’ అని అనుదీప్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -