Sunday, June 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండల కేంద్రానికి చేరుకున్న ప్రభుత్వ పాఠశాలల పాఠ్యపుస్తకాలు

మండల కేంద్రానికి చేరుకున్న ప్రభుత్వ పాఠశాలల పాఠ్యపుస్తకాలు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని ఫ్రీ ప్రైమరీ స్కూల్, మండల పరిషత్ మండల ప్రాథమికున్నత జిల్లా పరిషత్ పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠ్యపుస్తకాలను సరఫరా చేయడం జరిగిందని సీఆర్పీలు విజయ్ ప్రకాష్,  భీమ్రావు, భీమన్న, బిల్లు సింగ్, తెలిపారు. ఈ సందర్భంగా సిఆర్పీలు మాట్లాడుతూ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యను అభ్యసించే సంబంధించిన విద్యార్థిని , విద్యార్థులకు  జిల్లా విద్యాశాఖ ఆర్టిపుస్తకాలను సరఫరా చేయడం జరిగింది.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వచ్చే నెల 12వ తేదీ నుంచి అన్ని మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. పాఠశాలలో ప్రారంభం కాగానే పేద విద్యార్థులందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది అని మండల విద్యాశాఖ అధికారి తిరుపతయ్య ఫోన్ ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖండేబల్లూర్ జిల్లా పరిషత్ సీనియర్ ప్రధానోపాధ్యాయులు లాలయ్య, ఉపాధ్యాయుడు కౌలాస్ గ్రామ జెడ్పిహెచ్ఎస్ ఉపాధ్యాయుడు శ్రీనివాస్, మండల రిసోర్స్ పర్సన్స్ విజయ ప్రకాష్ , భీమన్న, భీమ్రావు, బిల్లు సింగ్, సిబ్బంది మొగులప్ప తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -