శివ కందుకూరి, రాజీవ్ కనకాల, తేజు అశ్విని ప్రధాన పాత్రలో హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాధా వి పపుడిప్పు నిర్మించిన చిత్రం ‘నవాబ్ కేఫ్’. ఈ మూవీకి ప్రమోద్ హర్ష దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఈనెల 20న రిలీజ్ చేయబోతున్నారు.
హీరో శివ కందుకూరి మాట్లాడుతూ, ”చారు వాలా’ అంటూ మా జర్నీని ప్రారంభించాం. సెన్సార్ రూల్స్, గైడ్ లైన్స్‌ని గౌరవిస్తూ మేం మా టైటిల్‌ను ‘నవాబ్ కేఫ్’గా మార్చాం. ఈ టైటిల్ మా సినిమాలోని స్టోరీని, ఆత్మని తెలియజేస్తుంది. టైటిల్ ఛేంజ్ అయినా, సెన్సార్ సమస్యలు వచ్చినా మా నిర్మాత వెంకట్ ఎక్కడా వెనక్కి తగ్గకుండా, కాంప్రమైజ్ కాకుండా నిలబడ్డారు. ఎంతో నిజాయితీతో, జెన్యూన్‌గా ఈ మూవీని చేశాం. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది. చిత్రం చూసి బయటకు వచ్చిన తరువాత కచ్చితంగా నాన్నకి ఫోన్ చేసి మాట్లాడతారు’ అని తెలిపారు.
”చారు వాలా’ టైటిల్ మాదిరిగానే ‘నవాబ్ కేఫ్’ టైటిల్‌ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఓ మంచి సినిమాతో మీ ముందుకు రాబోతున్నాం’ అని నిర్మాత వెంకట్ చెప్పారు. దర్శకుడు ప్రమోద్ హర్ష మాట్లాడుతూ,’నేను చూసిన, అనుభవించిన సంఘటనల్ని ఆధారంగా చేసుకునే ఈ కథను రాసుకున్నాను’ అని అన్నారు.
‘నవాబ్ కేఫ్’గా వస్తున్నాం
- Advertisement -
- Advertisement -



