నవతెలంగాణ – జుక్కల్
ప్రతీ ఏటా జూన్ మొదటి వారంలో మృగశిర కార్తి వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో ఏండ్ల నుంచి మృగశిర కార్తిరోజున ప్రతి ఒక్కరు మాంసం తినడం మన పూర్వీకుల నుంచి ఆనవాయితీగా వస్తోంది. అందువలన పేదలు, మధ్య తరగతివారు, ఉన్నవారు అనే తేడా లేకుండా అందరూ నేడు చేపలు కొనుగోలు చేసి కుటుంబమంతా కలిసి ఖచ్చితంగా తింటారు. ఈ క్రమంలో జుక్కల్ మండల కేంద్రంలో ఆదివారం చేపల మార్కేట్ జన సందోహంతో కిటకిటలాడింది. సాధారణంగా కేజీ చేపలు రూ. 50-100 లోపు ఉండేవి. కానీ నేడు అసలే ఆదివారం.. ఆపైన మృగశిర కార్తి రావడంతో కేజీ చేపలు రూ.150-200 పైనే ధరలు పెంచి అమ్ముతున్నారు. అయినా జనాలు ఎగబడి కొంటున్నారు. ఉదయం నుంచి మార్కేట్ రద్దీగానే కొనసాగుతోంది. మృగశిర కార్తి రోజున ధరల గురించి ఆలోచించమని, ఖచ్చితంగా చేపలు తిని తీరాల్సిందే అని వినియోగదారులు ఆనందంతో చెబుతున్నారు.
మృగశిర కార్తె ఎఫెక్ట్.. చేపల ధరలకు రెక్కలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



