Wednesday, February 11, 2026
E-PAPER
Homeఆటలున్యూజిలాండ్‌ జోరు

న్యూజిలాండ్‌ జోరు

- Advertisement -

యుఏఈపై 10 వికెట్లతో గెలుపు
చెన్నై :
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ గ్రూప్‌-డిలో న్యూజిలాండ్‌ వరుసగా రెండో విజయం సాధించింది. యుఏఈ తొలుత 20 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులు చేయగా.. న్యూజిలాండ్‌ 15.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఊదేసింది. కివీస్‌ ఓపెనర్లు టిమ్‌ సీఫర్ట్‌ (89 నాటౌట్‌, 42 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఫిన్‌ అలెన్‌ (84 నాటౌట్‌, 50 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీలతో చెలరేగారు. తొలి వికెట్‌కు అజేయంగా 175 పరుగులు జోడించిన ఓపెనర్లు కివీస్‌కు అదిరే విజయాన్ని అందించారు. గ్రూప్‌-ఏలో నమీబియాపై నెదర్లాండ్స్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత నమీబియా 156/8 పరుగులు చేయగా.. నెదర్లాండ్స్‌ 18 ఓవర్లలో 159/3తో లాంఛనం ముగించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -