Wednesday, February 11, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఇప్పటికీ ఫోన్‌ ట్యాపింగ్‌..!

ఇప్పటికీ ఫోన్‌ ట్యాపింగ్‌..!

- Advertisement -

అప్పటి పరికరాలను
భద్రపరిచి కొందరి దుశ్చర్యలు
ఎక్కడెక్కడ పరికరాలు పెట్టారో ఆరా తీస్తున్నాం
బాధ్యులపై చర్యలు తప్పవు
80 శాతం మున్సిపాలిటీలు గెలుస్తాం..:
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
ఇప్పటికీ ఫోన్‌ టాపింగ్‌ కొనసాగుతోందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి పరికరాలను భద్రపరిచి ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం దీనిని అత్యంత సీరియస్‌గా తీసుకుంటోందని వెల్లడించారు. పరికరాలు ఎక్కడెక్కడ పెట్టారో ఆరా తీస్తున్నామని తెలిపారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా చిట్‌ చాట్‌ లో ఆయన మాట్లాడారు. ట్యాపింగ్‌ కోసం ఎక్కడెక్కడ ఎక్విప్‌మెంట్‌ (పరికరాలు) అమర్చారో ప్రభుత్వం ఇప్పటికే ఆరా తీస్తోందని, విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజాస్వామ్య స్వేచ్ఛకు భంగం కలిగిస్తే వదిలిపెట్టం
”ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని, జరుగుతోందని అనేక మంది గగ్గోలు పెడుతున్నారు.. ఇది అక్షరాలా నిజం. ఇప్పుడు కూడా కొందరు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఎంక్వయిరీ చేస్తోంది. ఎవరు సూత్రధారులు? ఎక్కడెక్కడ పరికరాలు పెట్టారు? అనేది బయటకు తీస్తాం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది” అని మంత్రి స్పష్టం చేశారు. ఉద్యోగులను ఓట్లు అడగ డటంలో తప్పేముందని, తన పార్టీ తరపున తాను అడిగానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కు 80శాతం పైగా సీట్లు
రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ భారీ విజయం సాధించబోతోందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ”గడిచిన రెండేళ్లలో మేం చెప్పిన ప్రతి మాటనూ నిలబెట్టుకుని ప్రజలకు చేరువయ్యాం. అందుకే పురపాలక ఎన్నికల్లో 80 శాతానికి పైగా స్థానాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకోబోతోంది. ఇది జీర్ణించు కోలేకే ప్రతిపక్ష నాయకులు ఆక్రోశం వెళ్లగక్కు తున్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విసిరిన సవాళ్లను ప్రజలు తిప్పికొట్టారు.. అదే ఫలితం ఈ ఎన్నికల్లోనూ పునరావృతం కాబోతుంది” అని అన్నారు.

అభివృద్ధికి పెద్ద పీట
గత ప్రభుత్వ తీరుపై పొంగులేటి తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ”కాంగ్రెస్‌ అధికారం లోకి వచ్చే నాటికి ధనిక తెలంగాణను రూ. 8.19 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు. నెలకు రూ. 6,300 కోట్లు కేవలం అప్పులకే కడుతూ కూడా సంక్షేమాన్ని ఆపలేదు. గత దొరల పాలనలో పేదలను విస్మరిం చారు. 62 వేల డబుల్‌ బెడ్‌ రూంలను మొండి గోడలుగా మిగిల్చారు. కానీ మేం 4.5 లక్షల ఇందిర మ్మ ఇండ్లు మంజూరు చేశాం. ‘వరి వేస్తే ఉరి’ అన్న కాలం పోయి, ఇప్పుడు వడ్లకు బోనస్‌ ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం” అని వివరిం చారు. మాజీ మంత్రుల అసభ్య పదజాలానికి ప్రజలు ఓటు ద్వారానే తగిన గుణపాఠం చెబు తారని ఆయన పేర్కొన్నారు. గులాబీలకే పథకాలని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌ బీఆర్‌ఎస్‌ హయాంలో చేసిన వ్యాఖ్యల ఆడియోను ఈ సందర్భంగా వినిపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -